‘సీత’ ఇంకా ట్రెండింగ్ లోనే ఉందిగా !

Published on May 11, 2019 3:06 pm IST

తేజ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా వస్తోన్న చిత్రం ‘సీత’. కాగా నిన్న విడుదలైన ఈ చిత్రం యొక్క ట్రైలర్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. ఇప్పటికే 2 మిలియన్ల వ్యూస్ సాధించి ఇంకా ట్రెండింగ్ లోనే ఉంది. ట్రైలర్ లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉండడంతో సినిమా ఫై అంచనాలు పెరిగాయి.

ట్రైలర్ ను చూస్తుంటే మొత్తానికి ఎమోషనల్ కంటెంట్ తో కథ అంత సీత పాత్ర చుట్టూనే తిరుగుతున్నట్లు అనిపిస్తోంది. అలాగే సినిమాలో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ కూడా వుందట. మరి ఈ చిత్రంతోనైనా సాయిశ్రీనివాస్ హిట్ కొడతాడోలేదో చూడాలి.

ఇక ఈ సినిమాలో మన్నార చోప్రా , సోనూసూద్ ముఖ్యపాత్రల్లో నటిస్తుండగా అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఏకే ఎంటర్టైమెంట్స్ పతాకం ఫై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం మే 24న విడుదలకానుంది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి !

సంబంధిత సమాచారం :

More