నటుడు శివాజీ రీసెంట్ గా టికెట్ ధరలు పెంచడం పై మాట్లాడుతూ.. టికెట్ ధరలను పెంచడం వల్లే 99 శాతం మంది ప్రేక్షకులు థియేటర్లకు దూరమవుతున్నారని తెలిపిన సంగతి తెలిసిందే. కాగా శివాజీ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘దండోర’. డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో శివాజీ టికెట్ ధరల గురించి మాట్లాడుతూ.. ‘నేను ఉద్దేశపూర్వకంగా ఏమీ మాట్లాడను. ఏ విషయంలోనైనా నిజం చెబుతాను. ప్రస్తుతం ఉన్న సందర్భాన్ని ప్రజలకు గుర్తు చేయాలని మాట్లాడతాను’ అని తెలిపారు.
శివాజీ ఇంకా మాట్లాడుతూ.. ‘నేను చేసిన కామెంట్స్ తప్పుగా అర్థం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఐబొమ్మ రవి గురించి మాట్లాడాను. అతడికి ఉన్న తెలివితేటలను మంచి పనులకు ఉపయోగించుకుంటే బాగుంటుందని చెప్పాను. అతడు చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు కాబట్టి తప్పు చేసినట్లే అని చెప్పా. ఆ కామెంట్స్ విషయంలో నేను పశ్చాత్తాపడడం లేదు’ అని శివాజీ మళ్లీ తన కామెంట్స్ పై క్లారిటీ ఇచ్చారు. గతంలో శివాజీ చేసిన ఈ కామెంట్స్ పై కొందరు నెటిజన్లు నెగిటివ్ కామెంట్స్ పెట్టిన సంగతి తెలిసిందే.


