శివలింగాపురం ఆడియో, ట్రైలర్ విడుదల !

Published on Jun 9, 2019 7:00 pm IST

తమిళ, మలయాళ భాషలలో యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్న ఆర్.కె.సురేష్ ఇప్పుడు శివలింగాపురం చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. మధుబాల కథానాయికగా నటించింది. తోట కృష్ణ దర్శకుడు. రావూరి అల్లికేశ్వరి సమర్పణలో అపోలో ప్రొడక్షన్స్ పతాకం పై రావూరి వెంకటస్వామి నిర్మిస్తున్న ఈ చిత్రం ఆడియో, ట్రైలర్ విడుదల కార్యక్రమం ఆదివారం హైదరాబాద్ లో సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది.

ముఖ్యఅతిథిగా విచ్చేసిన నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ఆడియోను ఆవిష్కరించగా…ట్రైలర్ ను హీరో ఆర్.కె.సురేష్ విడుదలచేశారు. నిర్మాత రావూరి వెంకటస్వామి ఏవీని మరో అతిథి సాయివెంకట్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ, సినిమాలు తీయడమే కాకుండా సమాజానికి ఎంతో సేవ చేసిన వ్యక్తిగా రావూరి వెంకటస్వామికి మంచి పేరుంది. అభిరుచితో ఆయన తీసిన ఈ చిత్రం విజయవంతం కావాలి అన్నారు.

సంబంధిత సమాచారం :

More