రష్మీ “శివరంజిని” విడుదల తేదీ ఖరారు!

Published on Jul 21, 2019 6:33 pm IST

రష్మీ, నందు ప్రధాన పాత్రలలో యూ అండ్ ఐ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఏ. పద్మనాభ రెడ్డి,అయ్యన్న నాయుడు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “శివరంజని”. డైరెక్టర్ నాగ ప్రభాకర్ హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నాడు. కాగా ఈచిత్రాన్ని ఆగస్టు 2న విడుదల చేయనున్నారు. ఈ మేరకు చిత్ర బృందం ఓ పోస్టర్ ని విడుదల చేశారు.

ఐతే ఆగస్టు 2న గుణ 369,రాక్షసుడు, కొబ్బరి మట్ట, చిత్రాలు విడుదల కానున్నాయి. “శివరంజని” కూడా ఆగస్టు 2నే విడుదల కానుండటంతో ఒకే రోజు మొత్తం నాలుగు సినిమాలు విడుదల కానున్నాయి. గతంలో రష్మీ ‘నెక్స్ట్ నువ్వే’, ‘అంతకు మించి’ వంటి హారర్ చిత్రాలలో నటించడం జరిగింది. కమెడియన్ ధన్ రాజ్ ఈ మూవీలో ఓ కీలక పాత్ర చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :