కళ్యాణ్ రామ్ మూవీలో హాట్ ఐటమ్ బ్యూటీ

కళ్యాణ్ రామ్ మూవీలో హాట్ ఐటమ్ బ్యూటీ

Published on Jun 28, 2015 4:00 PM IST

Nora-Fatehi

1960ల నాటి నుంచి తెలుగు ప్రేక్షకుల చేత స్టెప్పులేయించిన క్రెడిట్ ఎక్కువగా ఐటెం సాంగ్ లేక్ దక్కింది. అప్పటి నుంచి ఇప్పటికీ కొనసాగుతున్న ఈ ఐటెం సాంగ్ ట్రెండ్ అలానే ఉన్నా తరానికి తగ్గట్టుగా ఐటెం గర్ల్స్ మారుతూ వస్తున్నారు. అలా ప్రస్తుతం టాలీవుడ్ లో హల్ చల్ చేస్తున్న ఐటెం బ్యూటీ నోర ఫతేహి. ఈ ఏడాది టెంపర్ లో ఐటెం సాంగ్ చేసి మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకున్న ఈ భామకి తెలుగులో వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఆఫర్స్ వస్తున్నాయి. నోర ఫతేహి టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ ‘బాహుబలి’ సినిమాలో కూడా ఓ స్పెషల్ సాంగ్ చేసింది.

అలాగే రవితేజ హీరోగా కళ్యాణ్ రామ్ నిర్మాతగా వస్తున్న ‘కిక్ 2’ సినిమాలో కూడా ఐటెం సాంగ్ చేసింది. తాజా సమాచారం ప్రకారం నందమూరి యంగ్ హీరో కళ్యాణ్ రామ్ ‘షేర్’ సినిమాలో కూడా ఓ స్పెషల్ సాంగ్ చేసే చాన్స్ కొట్టేసింది. ఇప్పటికే ఈ ఐటెం సాంగ్ కోసం మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ ఓ పెప్పీ సాంగ్ ని కంపోజ్ చేసాడని ఈ చిత్ర టీం చెబుతోంది. త్వరలోనే ఈ పాటని షూట్ చేయనున్నారు. మల్లికార్జున్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. కళ్యాణ్ రామ్ సరసన సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటిస్తోంది.

తాజా వార్తలు