త్వరలో టీవీ ప్రీమియర్ గా “స్కంద”

త్వరలో టీవీ ప్రీమియర్ గా “స్కంద”

Published on Jan 12, 2024 4:37 PM IST

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రధాన పాత్రలో, డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ స్కంద. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంది. రామ్ పోతినేని ఈ సినిమా లో డ్యూయల్ రోల్ లో నటించి అలరించారు. ఈ చిత్రం ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతోంది.

త్వరలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రముఖ టీవీ ఛానల్ అయిన స్టార్ మా లో ప్రసారం కానుంది. శ్రీ లీల, సాయి మంజ్రేకర్ లేడీ లీడ్ రోల్స్ లో నటించిన ఈ చిత్రం లో శ్రీకాంత్ కీలక పాత్రలో నటించారు. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించిన ఈ చిత్రం బుల్లితెర పై ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు