కాస్త ఆలస్యంగా పొల్లాచ్చి వెళ్లనున్న గోవిందుడు

Published on Jul 16, 2014 8:37 am IST

Govindudu-Andarivadele
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘గోవిందుడు అందరివాడేలే’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ చిత్ర టీం ముందుగా జూలై 13 నుంచి పొల్లాచ్చి షెడ్యూల్ మొదలు పెట్టాలి అనుకున్నారు. కానీ అది కాస్తా ఆలస్యం అయ్యింది. పొల్లాచ్చి షెడ్యూల్ ఈ నెల 20 నుంచి లేదా 20వ తేదీ తర్వాత మొదలుకానుంది. పొల్లాచ్చి షెడ్యూల్ ఆలస్యం కావడంతో హైదరాబాద్ లోనే షూటింగ్ చేస్తున్నారు.

రామ్ చరణ్ స్టైలిష్ లుక్ లో కనిపించనున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చరణ్ కెరీర్లోనే బెస్ట్ సినిమా అవుతుందని ఈ చిత్ర నిర్మాత బండ్ల గణేష్ చెబుతున్నారు. ప్రకాష్ రాజ్, శ్రీ కాంత్, జయసుధ, కమలినీ ముఖర్జీ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్నాడు. మొత్తం 5 పాటలు ఉండే ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ ని జూలై 28న రిలీజ్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం :