మూడవరోజుకే లాభాలు పంచుతున్న “ఇస్మార్ట్ శంకర్”

మూడవరోజుకే లాభాలు పంచుతున్న “ఇస్మార్ట్ శంకర్”

Published on Jul 21, 2019 10:14 AM IST

“ఇస్మార్ట్ శంకర్” వసూళ్ల పరంపర కొనసాగుతూనే ఉంది. మూవీ విడుదలై నాలుగు రోజులవుతున్నా కలెక్షన్స్ స్టడీ గా కొనసాగుతున్నాయి. మూవీ మాస్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవడంతో పాటు, పోటీ ఇచ్చే సినిమాలేవీ లేకపోవడం వసూళ్లకు దోహదం చేస్తుంది. నిన్న విడుదలైన “ఆమె” చిత్రం హిట్ టాక్ తెచ్చుకున్నా డబ్బింగ్ చిత్రం కావడంతో పాటు, కమర్షియల్ ఎలిమెంట్స్ లేక పోవడంతో ఆ చిత్రం ఇస్మార్ట్ శంకర్ కి పోటీకాకపోవచ్చు. ఇక విక్రమ్ నటించిన “మిస్టర్ కె కె” నెగెటివ్ టాక్ తో నడుస్తుంది.

“ఇస్మార్ట్ శంకర్” ఆంధ్రా,తెలంగాణా రాష్ట్రాలలో మూడురోజులకు గాను 16.73 కోట్ల షేర్ సాధించింది. ఇంకా ఆదివారం మిగిలివుండటంతో వీకెండ్ పూర్తయ్యే సరికి 20కోట్ల షేర్ సాధించవచ్చు. కాగా వరల్డ్ వైడ్ ఈ మూవీ ఇప్పటికి 36కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. మూడు రోజులకే కొన్ని ఏరియాలలో డిస్ట్రిబ్యూటర్స్ లాభాలలోకి ప్రవేశించారని సమాచారం. ఏది ఏమైనా పూరి మళ్లీ ఇన్నేళ్లకు తన మార్కు విజయం సాధించి డిస్ట్రిబ్యూటర్స్ కి లాభాలు పంచాడు.

రెండు తెలుగు రాష్ట్రాలలో ఏరియాల వారీగా మూడు రోజులకు గాను వసూళ్లు ఇలా ఉన్నాయి.

 

ఏరియ కలెక్షన్స్
నైజాం రూ.7.36కోట్లు
సీడెడ్ రూ.2.82కోట్లు
వైజాగ్ రూ.1.92కోట్లు
ఈస్ట్ రూ.1.07కోట్లు
వెస్ట్ రూ.0.84కోట్లు
కృష్ణ రూ.1.03కోట్లు
గుంటూరు రూ.1.16కోట్లు
నెల్లూరు రూ.0.53కోట్లు
రెండు తెలుగు రాష్ట్రాలలో మూడు రోజులకు గాను మొత్తం షేర్ రూ. 16.73కోట్లు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు