హైదరాబాద్లో సినిమా మొదలుపెట్టనున్న అజిత్

Published on Dec 10, 2019 9:02 pm IST

తమిళ స్టార్ హీరో అజిత్ తన సినిమాల్లో భారీ సెట్టింగ్స్ వేసి షూటింగ్ చేయాల్సి వస్తే వెంటనే రామోజీఫిల్మ్ సిటీకి వచ్చేస్తుంటారు. ఆయన గతంలో చేసిన చాలా సినిమాలు రామోజీఫిల్మ్ సిటీ లోనే చిత్రీకరణ జరుపుకోగా కొత్త చిత్రం ‘వాలిమై’ సైతం అక్కడే మొదలుకానుంది. డిసెంబర్ 13 నుండి ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేకమైన సెట్లో చిత్రీకరణ మొదలుకానుంది. ముఖ్య తారాగణం ఈ షూటింగ్లో పాల్గొననున్నారు.

అజిత్ గత చిత్రం ‘నెర్కొండ పారవై’ను డైరెక్ట్ చేసిన హెచ్.వినోత్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నాడు. ఇందులో అజిత్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. హెవీ యాక్షన్ ఎంటెర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంపై అజిత్ అభిమానుల్లో తారాస్థాయి అంచనాలున్నాయి. శ్రీదేవి భర్త, ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే యేడాది వేసవికి చిత్రం విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :

X
More