సమీక్ష : ఎస్ఎమ్ఎస్ – ప్రేమ – ద్వేషం మధ్య దోబూచులాట

సమీక్ష : ఎస్ఎమ్ఎస్ – ప్రేమ – ద్వేషం మధ్య దోబూచులాట

Published on Feb 10, 2012 8:15 PM IST
విడుదల తేది : 10 ఫిబ్రవరి 2012
123తెలుగు.కాం రేటింగ్: 3/5
దర్శకుడు : తాతినేని సత్య
నిర్మాత :ఆర్ బి చౌదరి
సంగిత డైరెక్టర్ : వి సెల్వ గణేష్
తారాగణం : పోసాని సుధీర్, రెజీన

ప్రిన్స్ మహేష్ బాబు బావ అయిన సుదీర్ బాబు హీరోగా చేసిన మొదటి చిత్రం ‘ఎస్ఎమ్ఎస్’. రేజీన హీరొయిన్ గా నటించగా ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్లో ఈ రోజే విడుదలైంది. తాతినేని సత్య దర్శకత్వం వహించిన ఎస్ఎమ్ఎస్ చిత్రం ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.

కథ:

ఈ చిత్రంలో కథ పెద్దగా ఏమీ లేదు. శివ (సుదీర్ బాబు) ఒక కొరియర్ సంస్థలో పనిచేస్తూ ఉంటాడు. అతను పెద్దగా బాధ్యతలు లేకుండా బతికేస్తుంటాడు. ఒకసారి ట్రైన్లో ప్రయాణిస్తుండగా రేడియో జాకీగా పనిచేసే శృతి (రేజీన) తో పరిచయం ఏర్పడుతుంది. ఆమెను మొదటి చూపులోనే ప్రేమించి ఆమెను మెప్పించే ప్రయత్నం చేస్తుంటాడు. శృతి అయిష్టంగానే అతనిని పరిచయం చేసుకుంటుంది. కాని మెల్లిగా శృతి అతన్ని ప్రేమించడం మొదలు పెట్టి తన ప్రేమను అతనికి తెలిపే సమయంలో శివ తన భాద్యతారాహిత్యమైన నేచర్ తో ఆమెని అవమానిస్తాడు. అలా ప్రేమ వారిద్దరి మధ్య దోబూచులాడుతుంది. ఈర్ష్య మరియు కోపంతో వారిద్దరు పోట్లాడుకుంటూ ఉంటారు. శివ భవిష్యత్తులో స్థిరపడితే పెళ్లి చేసుకుంటానని శృతి అంటుంది. అదే సమయంలో వీరి ప్రేమ అనుకోని మలుపు తిరుగుతుంది. తరువాత ఏం జరిగింది. వీరి ప్రేమ చివరికి సక్సెస్ అయిందా అనేది మిగతా చిత్ర కథ.

ప్లస్ పాయింట్స్:

సుదీర్ బాబు డాన్సులతో మెప్పించాడు. ఫైట్స్ కూడా చాలా బాగా చేసాడు. ఇది అతని మొదటి చిత్రమైన కూడా బాగా నటించాడు. అతని ఎనర్జీ లెవల్స్ కూడా బావున్నాయి. రేజీన చాలా బాగా చేసింది. శృతి పాత్రకి ఆమె అతికినట్లు సరిపోయింది. తన అందంతో ప్రతీ ఒక్కరిని ఆకట్టుకుంటూ నటనతో అందరిని మెప్పించింది. చీరల్లో ఇంకా బావుంది. ఎమోషనల్ సన్నివేశాల్లో చాలా బాగా చేసింది. ఆమెకు కూడా భవిష్యత్తులో ఇండస్ట్రీలో నిలదొక్కుకొనే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. హీరో స్నేహితుడు చంటి బాగానే నవ్వించాడు. క్లైమక్స్ లో తాగుబోతు రమేష్ బాగా నవ్వించాడు. సుదీర్, రేజీన మధ్య రొమాంటిక్ సన్నివేశాలు యువతను ఆకట్టుకునేలా బాగా తీసాడు. హీరో పాత్ర ఎంటర్టైన్ చేస్తూ చిత్ర మొదటి భాగం వేగంగా సాగుతుంది.

మైనస్ పాయింట్స్:

సుదీర్ తన గొంతు విషయంలో జాగ్రత్త తీసుకుంటే బావుంటుంది. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో ఇంకాస్త జాగ్రత్త తీసుకుంటే బావుంటుంది. చిత్ర రెండవ భాగం బాగా నెమ్మదిగా సాగింది. దర్శకుడు మధ్యలో అనవసరమైన విషయాలు మధ్యలోకి తీసుకొచ్చాడు. సుదీర్ తల్లిగా చేసిన రోహిణి కొంచెం అత్యుత్సాహం ప్రదర్శించింది. సాంగ్స్ సందర్భానుసారంగా లేకుండా కొంత అసహనానికి గురి చేస్తాయి. వెన్నెల కిషోర్ ని సరిగా వాడుకోలేకపోయారు. దర్శకుడు కొంత వరకు మాత్రమే పర్వాలేదనిపించాడు.

సాంకేతిక విభాగం:

నిర్మాణాత్మక విలువలు బావున్నాయి. సినిమాటోగ్రఫీ బావుంది. విజువల్స్ కూడా బావున్నాయి. శేఖర్ మాస్టర్ కోరియోగ్రఫీ మరియు ఫైట్స్ గురించి ప్రత్యేకంగా అభినందించాలి. సంభాషణలు పర్వాలేదు. ఎడిటింగ్ ఇంకా బాగా చేయాల్సింది. సెల్వ గణేష్ మ్యూజిక్ కొన్ని పాటల్లో బావుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బావుంది. చిత్ర రెండవ భాగంలో స్క్రీన్ప్లే ఇంకా బాగా రాసుకుని ఉంటే బావుండేది.

తీర్పు:

ఎస్ఎమ్ఎస్ చిత్రం సుదీర్ బాబు హీరోగా తెరంగ్రేటం చేయడానికి సరైన సినిమానే అని చెప్పుకోవాలి. అతని డాన్సులు మరియు ఫైట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. రేజీన ఈ చిత్రానికి బాగా ప్లస్ అయింది. ఆమె యువతకి బాగా నచ్చుతుంది. అంచనాలు ఏమీ లేకుండా వెళ్లి చూడండి మీకు తప్పక నచ్చుతుంది.

123తెలుగు.కామ్ రేటింగ్: 3/5

అనువాదం :అశోక్ రెడ్డి. ఎమ్

Clicke Here For ‘SMS’ English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు