ధనుష్ కు జోడిగా సీనియర్ హీరోయిన్ !

Published on Mar 3, 2019 3:58 am IST


తమిళ హీరో ధనుష్ ప్రస్తుతం ‘అసురన్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈచిత్రం తోపాటు ఆయన ,దురై సెంథిల్ కుమార్ తో సినిమా చేయనున్నాడు. ఈ చిత్రంలో ధనుష్ డ్యూయల్ రోల్ లో నటించనున్నాడు. అందులో ఒకటి తండ్రి పాత్ర కాగా మరొకటి కొడుకు పాత్ర. తండ్రి పాత్రకు జోడిగా సీనియర్ నటి స్నేహ ను తీసుకోనున్నారట. అదే జరిగితే దాదాపు 12 సంవత్సరాల తరువాత మళ్ళీ ధనుష్ తో నటించనుంది స్నేహ. గతంలో వీరిద్దరూ కలిసి ‘పుదుపేట్టై’ అనే చిత్రంలో కలిసి నటించారు.

ఇక ధనుష్ – సెంథిల్ కుమార్ కాంబినేషన్ లో ఇది రెండవ సినిమా. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో ‘కోడి’ అనే సినిమా తెరకెక్కింది. సత్య జ్యోతి ఫిలిమ్స్ నిర్మించనున్న ఈ కొత్త చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.

సంబంధిత సమాచారం :