స్నేహా ఉల్లాల్‌కు.. నటిగా పదేళ్ళు!

sneha-ullal
స్నేహా ఉల్లాల్ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి నేటికి పదేళ్ళు. 2005లో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన చిత్రం ‘లక్కీ’ ద్వారా స్నేహా వెండితెరకు పరిచయమైంది. ఆ సినిమా విడుదలై నేటికి సరిగ్గా పదేళ్ళు. ఆ సినిమా తర్వాత బాలీవుడ్‌లో మరో రెండు సినిమాలు చేసిన స్నేహా, ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. 2008లో విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా ద్వారా తెలుగు పరిశ్రమకు పరిచయమైన స్నేహా ఉల్లాల్, ఆ తర్వాత వరుసగా అవకాశాలను అందిపుచ్చుకుంది.

‘నేను మీకు తెలుసా’, ‘కరెంట్’, ‘సింహ’ వంటి సినిమాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఐశ్వర్య రాయ్ పోలికలు స్నేహా ఉల్లాల్‌కు ఉంటాయన్న కామెంట్స్‌తో ఆమెకు బాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉంది. ప్రస్తుతం ఒక తెలుగు సినిమాతో పాటు మరో రెండు హిందీ సినిమాల్లో నటిస్తోంది స్నేహా ఉల్లాల్. నటిగా పదేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా తన ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకుంది. ఈ పదేళ్ళు ఏదో చిన్నపిల్లల ఆటలాగా గడిచిపోయిందని, తానెప్పుడూ నటి అవ్వాలనుకోలేదని, ఇప్పుడు నటిగా ఇంత మంచి పేరు సంపాదించుకోగలగడం అద్భుతంగా కనిపిస్తోందని తెలిపింది.

Exit mobile version