మరి “సర్కారు” నుంచి ఈ మాస్ జాతర కన్ఫర్మ్ అయ్యినట్టేగా!

Published on Jul 30, 2021 12:23 pm IST


సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ చిత్రం “సర్కారు వారి పాట” పై హైప్ ఏ లెక్కన పెరుగుతుందో చూస్తూనే ఉన్నాము. మహేష్ ప్రతీ సినిమా లానే ఈ చిత్రానికి కూడా డిఫరెంట్ స్టైల్ ప్రమోషన్స్ తో నిన్నటి సాలిడ్ అప్డేట్ నుంచే ఈ చిత్రంపై హీట్ ఇంకో లెవెల్లోకి వెళ్ళింది.

అయితే ఈసారి మహేష్ బర్త్ డే కి అదిరే అప్డేట్స్ ఉన్నాయని ముందు నుంచి స్ట్రాంగ్ బజ్ ఉండగా ఇప్పుడు అది కన్ఫర్మ్ అయ్యినట్టే అని చెప్పాలి. రేపు ఎలాగో ఫస్ట్ లుక్ పోస్టర్ కన్ఫార్మ్ కాగా ఇక మహేష్ బర్త్ డే కి బ్యాలన్స్ ఉన్నది టీజర్ అనే చెప్పాలి. దానిని కూడా దర్శకుడు పరశురామ్ పెట్ల అదిరే లెవెల్లో మంచి మాస్ ఎలిమెంట్స్ సహా డైలాగ్ తో కూడా లాక్ చేసినట్టు తెలుస్తుంది.

ఇప్పటికే మహేష్ ఫ్యాన్స్ కూడా ఆ టీజర్ కి భారీ రికార్డులు సెట్ చెయ్యాలని ప్లాన్స్ గీస్తున్నారు. సో ఈ లెక్కన వచ్చే ఆగష్టు 8 లేదా 9 న సర్కారు వారి మాస్ జాతర కన్ఫర్మ్ అనే చెప్పాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :