యుఎస్ టాప్ 3 లో ప్లేస్ కొట్టేసిన ‘S/O సత్యమూర్తి’

Son-of-Satyamurthy-telugu_r
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన ప్యూర్ ఎమోషనల్ ఎంటర్టైనర్ ‘S/O సత్యమూర్తి’. నిన్న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమాకి అన్ని చోట్ల నుండి మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే టాక్ వినిపిస్తోంది. మొదటి రోజే ఈ సినిమా యుఎస్ లో రికార్డ్ సృష్టించింది. ఇక అసలు విషయంలోకి వెళితే… ‘S/O సత్యమూర్తి’ సినిమాని యుఎస్ లో సుమారు 160 లొకేషన్స్ లో ప్రీమియర్స్ వేసారు. ఈ ప్రీమియర్స్ ద్వారా ‘S/O సత్యమూర్తి’కి $ 338K ని కలెక్ట్ చేసింది. ఇంత అత్యధిక ప్రీమియర్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాల్లో టాప్ 3 లో ‘S/O సత్యమూర్తి’ స్థానం సంపాదించుకుంది.

ఇప్పటివరకూ తుఎస్ లో ప్రీమియర్స్ పరంగా ఆగడు సినిమా $527K కలెక్ట్ చేసి ఫస్ట్ లచే లో ఉంటే, అత్తారింటికి దారేది $345K తో సెకండ్ ప్లేస్ లో ఉంది. ఇప్పుడు ‘S/O సత్యమూర్తి’ $338K తో మూడవ స్థానాన్ని దక్కించుకుంది. త్రివిక్రమ్ – అల్లు అర్జున్ సినిమాలకు యుఎస్ లో ఎక్కువ డిమాండ్ ఉండడం వలెనే ఈ రేంజ్ కలెక్షన్స్ వచ్చాయని ట్రేడ్ పండితులు అంటున్నారు. అలాగే లాంగ్ వీకెండ్ కావడం వలన మొదటి వీకెండ్ లోనే 1 మిలియన్ మార్క్ ని క్రాస్ చేస్తుందని అంటున్నారు.

అల్లు అర్జున్ సరసన సమంత, ఆద శర్మ, నిత్యా మీనన్ లు హీరోయిన్స్ గా నటించగా ఉపేంద్ర, రాజేంద్ర ప్రసాద్, స్నేహ ప్రధాన పాత్రల్లో కనిపించారు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాని ఎస్ రాధాకృష్ణ నిర్మించాడు.

Exit mobile version