అమెరికాలోనూ ‘S/O సత్యమూర్తి’ అదుర్స్..!

అమెరికాలోనూ ‘S/O సత్యమూర్తి’ అదుర్స్..!

Published on Apr 11, 2015 12:06 AM IST

son-of-sathyamurthy
అల్లు అర్జున్, త్రివిక్రమ్‌ల సూపర్‌హిట్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం ‘S/O సత్యమూర్తి’. భారీ అంచనాల మధ్య నిన్న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. అల్లు అర్జున్ యాక్టింగ్‌కు, త్రివిక్రమ్ స్టైల్ మేకింగ్‌కు మంచి మార్కులు పడ్డాయి. ఇక భారీ ఎత్తున ఎక్కువ థియేటర్లలో విడుదలవ్వడం, సినిమాకు మంచి స్పందన రావడంతో ‘S/O సత్యమూర్తి’ మొదటి రోజు కలెక్షన్లను కుమ్మేసింది. సమంత, నిత్యామీనన్, అదాశర్మలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచారు.

ఇక ఇప్పటివరకూ అందిన సమాచారం మేరకు మొదటి రోజు నైజాం ఏరియాలో ఈ సినిమా 3.15 కోట్ల షేర్ సాధించినట్లు తెలుస్తోంది. ఈ కలెక్షన్లతో అత్తారింటికి దారేది (3.28 కోట్లు) తర్వాత రెండో స్థానంలో ‘S/O సత్యమూర్తి’ నిలిచినట్లైందని ట్రేడ్ టాక్. నైజాం ఏరియాతో పాటు సీడెడ్, ఆంధ్రాలోని అన్ని జోన్లలో మంచి కలెక్షన్లతో సినిమా దుమ్ము దులిపింది. ఓవరాల్‌గా తెలుగు మార్కెట్లో మొదటి రోజే 9.30కోట్లు సంపాదించింది. అమెరికాలోనూ ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మొదటి రోజు అమెరికాలో దాదాపుగా 3 కోట్లకు పైనే కొల్లగొట్టింది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు మంచి ప్లస్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు. హారిక ఆన్డ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు