
‘జులాయి’ సూపర్ హిట్ మూవీ, అదే కాంబినేషన్ లో మూవీ వస్తోంది అంటే అంచనాలు భారీగానే ఉంటాయి. ఆ కాంబినేషనే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇప్పుడు అదే కాంబినేషన్ లో వచ్చిన ప్యూర్ ఎమోషనల్ ఎంటర్టైనర్ ‘S/O సత్యమూర్తి’ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్స్ సృష్టిస్తోంది. ఈ సినిమా ఒక్క ఆంద్ర, తెలంగాణలోనే కాకుండా కర్ణాటక, చెన్నైలతో పాటు ఓవర్సీస్ లో కూడా సూపర్బ్ కలెక్షన్స్ రాబట్టుకుంటోంది. గత గురువారం రిలీజ్ అయిన ఈ సినిమాకి ప్రీమియర్ షోస్ నుంచే సూపర్బ్ కలెక్షన్స్ వస్తున్నాయి.
ఓవర్సీస్ లో కేవలం మూడు రోజుల్లో 1 మిలియన్ క్రాస్ చేసిందని ఇది వరకే తెలియజేశాం.మాకు అందిన విశ్వసనీయ వర్గాల సమాచారం కలెక్షన్ ప్రకారం ‘S/O సత్యమూర్తి’ మొదటి వీకెండ్ లోనే 30 కోట్ల షేర్ ని సంపాదించింది. సుమారు 31 కోట్ల వరకూ కలెక్షన్స్ ఉంటాయని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. కేవలం మొదటి వీకెండ్ లోనే 30 కోట్ల మార్క్ క్రాస్ చెయ్యడంతో ఈ చిత్ర టీంతో పాటు, డిస్ట్రిబ్యూటర్స్ కూడా చాలా హ్యాపీ గా ఉన్నారు. అంతే కాకుండా మొదటి వారంలో ఈజీగా 35 నుంచి 40 కోట్ల మధ్యలో కలెక్ట్ చేస్తుందని కూడా అంటున్నారు. ప్రస్తుతం మేము ఏరియా వైజ్ కలెక్షన్స్ ట్రాక్ చేస్తున్నాం. అవి రాగానే మీకు అందిస్తాం..
అల్లు అర్జున్ సరసన సమంత, నిత్యా మీనన్, ఆద శర్మ హీరోయిన్స్ గా నటించగా ఉపేంద్ర, రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలు పోషించారు. ఎస్. రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు.

