3 రోజుల్లో 1 మిలియన్ కొట్టిన ‘S/O సత్యమూర్తి’

3 రోజుల్లో 1 మిలియన్ కొట్టిన ‘S/O సత్యమూర్తి’

Published on Apr 12, 2015 7:04 PM IST

Son-Of-SatyaMurty
‘జులాయి’ తర్వాత సూపర్ హిట్ కాంబినేషన్ అయిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వచ్చిన ప్యూర్ ఎమోషనల్ ఎంటర్టైనర్ ‘S/O సత్యమూర్తి’. గత గురువారం రిలీజ్ అయిన ఈ సినిమాకి అన్ని చోట్ల నుండి మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే టాక్ తెచ్చుకోవడంతో సూపర్బ్ కలెక్షన్స్ వస్తున్నాయి. మొదటి రోజు ప్రీమియర్ షోస్ నుంచే ఈ సినిమా యుఎస్ లో రికార్డ్స్ సృష్టించింది.

ప్రీమియర్స్ పరంగానే కాకుండా ఈ సినిమా మొదటి మూడు రోజుల్లో ఐ మిలియన్ మార్క్ ని క్రాస్ చేసి క్రేజీ రికార్డ్ ని సృష్టించింది. సినిమా విడుదలైన మొదటి వీకెండ్ లోనే ఐ మిలియన్ మార్క్ క్రాస్ చేయడంతో అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ చాలా హ్యాపీ గా ఉన్నారు. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన ‘జులాయి’ సినిమా కూడా యుఎస్ లో 1 మిలియన్ మార్క్ క్రాస్ చేసింది. వీరి కలయికలో వచ్చిన రెండవ సినిమా కూడా యుఎస్ లో 1 మిలియన్ మార్క్ కలెక్ట్ చేసి కొత్త రికార్డ్ నెలకొల్పింది.

‘S/O సత్యమూర్తి’ యుఎస్ కలెక్షన్ రిపోర్ట్ :

వారం  కలెక్షన్ ఇన్ డాలర్స్ 
బుధవారం ప్రీమియర్స్
$ 345K 
గురువారం  $ 138K 
శుక్రవారం $ 249K 
శనివారం $ 278K 
మొత్తం షేర్     $ 1010K 

అల్లు అర్జున్ సరసన సమంత, ఆద శర్మ, నిత్యా మీనన్ లు హీరోయిన్స్ గా నటించగా ఉపేంద్ర, రాజేంద్ర ప్రసాద్, స్నేహ ప్రధాన పాత్రల్లో కనిపించారు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాని ఎస్ రాధాకృష్ణ నిర్మించాడు.

తాజా వార్తలు