ఇంటర్వ్యూ : హీరోయిన్ ఆరతి గుప్తా – ‘సోదరా’ మూవీ నా రియల్‌లైఫ్‌కు దగ్గరగా ఉంది!

ఇంటర్వ్యూ : హీరోయిన్ ఆరతి గుప్తా – ‘సోదరా’ మూవీ నా రియల్‌లైఫ్‌కు దగ్గరగా ఉంది!

Published on Apr 22, 2025 10:00 PM IST

సంపూర్ణేష్‌ బాబు, సంజోష్‌లు హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘సోదరా’. ఈ చిత్రానికి మన్‌ మోహన్‌ మేనంపల్లి దర్శకుడు. క్యాన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై చంద్ర చగంలా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆరతి గుప్తా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్బంగా ఆరతి గుప్తా విలేకరులతో ముచ్చటించారు.

ఈ సినిమాలో పార్ట్‌ కావడానికి మిమ్ములను ఆకట్టుకున్న అంశం ఏమిటి?

కథ నచ్చి ఒప్పుకున్నాను. బ్యూటీ ఆఫ్‌ ద స్క్రిప్ట్‌. లైట్‌ హార్టెడ్‌ ఫ్యామిలీ డ్రామా ఇది. ఈ సినిమా మీ స్నేహితులు, ఫ్రెండ్స్‌, ఫ్యామిలీ ఎవరితోనైనా చూడొచ్చు. ఈ సినిమాలో నా పాత్ర కూడా బాగా నచ్చింది. అమాయకమైన పల్లెటూరి అమ్మాయిగా కనిపిస్తాను. సింపుల్‌ విలేజ్‌ గర్ల్‌. చదువున్న అమ్మాయి. ఇన్నోసెంట్‌, అండ్‌ డిగ్నిఫైడ్‌. పాత్ర అది.

సంపూ, సంజోష్‌లతో కలిసి నటించడం మీకెలా ఉంది?

ఇద్దరూ ఎంతో స్వీట్‌ పర్సన్‌. ఎంతో కో ఆపరేటివ్‌. ఇద్దరూ సెట్‌లో ఉంటే ఎంతో ఎనర్జీ ఉంటుంది.

మీరు తెలుగు నేర్చుకుంటున్నానని ఇన్‌స్టాలో పోస్ట్‌ పెట్టారు ఎందుకని?

ఈ చిత్రం ట్రైలర్‌ లాంచ్‌లో నిర్మాత ఎస్‌కేఎన్‌ చెప్పిన మాటలను ప్రేరణగా తీసుకుని తెలుగు నేర్చుకుంటున్నాను. తెలుగు ఎంతో బ్యూటీఫుల్‌గా ఉంది. ఇక్కడ స్థిరపడాలంటే తెలుగు నేర్చుకోవాలి. అప్పుడే నాకు కంఫర్ట్‌గా ఉంటుంది.

దర్శకుడు మోహన్‌ గారు గురించి?

దర్శకుడు మోహన్‌ గారు ఎంతో కోఆపరేటివ్‌, ఎంతో సపోర్ట్‌ చేస్తారు. పర్‌ఫార్మ్‌ చేయడానికి స్కోప్‌ వున్ పాత్రను ఇచ్చారు. ఆయన వల్లే బాగా నటించగలిగాను.

ట్రెడిషినల్‌ పాత్రను చేయడం ఎలా అనిపించింది?

ఇంతకు ముందు ట్రెడిషినల్‌ పాత్రలు చేశాను. రియల్‌లైఫ్‌లో కూడా నేను సింపుల్‌ గర్ల్‌ నా వ్యక్తిత్వం అలానే ఉంటుంది. నా వ్యక్తిత్వానికి దగ్గర ఉండే పాత్రను ఈ సినిమాలో చేశాను.

మీకు పర్‌ఫార్మెన్స్‌ ఓరియెంట్‌డ్‌ పాత్రలు చేయాలని ఉందా? లేక గ్లామర్‌ పాత్రలు చేయాలని ఉందా?

పర్‌ఫార్మెన్స్‌ ఓరియెంటెడ్‌ పాత్రలు చేయాలని ఉంది. బాగా యాక్ట్‌ చేయగలిగితే మనం అందంగా కనిపిస్తాం. ఒకవేళ అందంగా ఉండి యాక్ట్‌ చేయలేకపోయినా గ్లామర్‌గా కనిపించం. పర్‌ఫార్మన్స్‌ ఓరియెంటెడ్‌ సినిమాలకే నా మొదటి ప్రాధాన్యత.

టాలీవుడ్‌లో మీకు ఇష్టమైన హీరో ఎవరు?

అల్లు అర్జున్‌ గారంటే చాలా ఇష్టం, ఆయన సినిమాలు చాలా ఇష్టం.

తెలుగు సినిమాలో మీకు నచ్చింది ఏమిటి?

తెలుగు సినిమాలో టైమ్‌ పంక్చూవాలిటి చాలా ఇష్టం. ఇక్కడ ఆర్టిస్టుల ప్రొఫెషనలిజం కూడా చాలా ఇష్టం. ప్రతి ఆర్టిస్టును సమానంగా చూడటం నాకు చాలా నచ్చింది. తెలుగు సినిమా గురించి నేను ఇంకా తెలుసుకోవాల్సి చాలా ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు