‘మనం’ సినిమా తర్వాత కింగ్ నాగార్జున మరోసారి ద్విపాత్రాభినయంలో నటిస్తున్న సినిమా ‘సోగ్గాడే చిన్ని నాయనా’. ఆగష్టు 29న నాగార్జున బర్త్ డే కానుకగా రిలీజ్ చేసిన ఫస్ట్ టీజర్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ‘ఆత్మ’ల కాన్సెప్ట్ నేపధ్యంలో ఆధ్యంతం ప్రేక్షకులను నవ్వించే ఎంటర్టైనర్ గా ఉండనుందని సమాచారం. ఈ సినిమాని ఇటీవలే సంక్రాంతి బరిలో రిలీజ్ చేయాలనుకుంటున్నారని ఇదివరకే తెలియజేశాం.
తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర టీం సంక్రాంతికి రిలీజ్ అనే విషయాన్ని ఖరారు చేసేయ్యడమే కాకుండా రిలీజ్ డేట్ ని కూడా ఫైనల్ చేసారు. సంక్రాంతి కానుకగా జనవరి 15న రిలీజ్ చేయడానికి ఫిక్స్ చేసారు. రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తూ సరికొత్త ట్రైలర్ ని కూడా త్వరలోనే రిలీజ్ చేయనున్నారు. కళ్యాణ్ కృష్ణ దర్శకుడిగా పరిచయం కానున్న సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో రమ్యకృష్ణ, లావణ్య త్రిపాటి హీరోయిన్స్ గా కనిపించనున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకి నిర్మాత రాధా మోహన్ కథ, స్క్రీన్‌ప్లే అందించడం విశేషం.
