‘బ్రూస్ లీ’కి సాలిడ్ అడ్వాన్స్ బుకింగ్స్!

‘బ్రూస్ లీ’కి సాలిడ్ అడ్వాన్స్ బుకింగ్స్!

Published on Oct 14, 2015 11:09 PM IST

Bruce-Lee
రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శ్రీనువైట్ల రూపొందించిన ‘బ్రూస్ లీ’ సినిమా మరో రెండు రోజుల్లో భారీ ఎత్తున విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ దసరా సీజన్‌లో భారీ అంచనాల మధ్యన విడుదలవుతోన్న సినిమా కావడంతో బ్రూస్ లీ పట్ల అభిమానులు, ప్రేక్షకులే కాక ఇండస్ట్రీ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్‌లో సూపర్ క్రేజ్ కనిపిస్తోంది. ఇప్పటికే ఆన్‌లైన్‌తో పాటు మిగతా అన్ని ఇతర థియేటర్లలోనూ అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి.

ఇక ముఖ్యంగా ఫస్ట్ వీకెండ్ బ్రూస్ లీకి సంబంధించిన టికెట్స్ చాలావరకూ అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఇప్పటికే అమ్ముడైపోతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి చాలాకాలం తర్వాత తెరపై కనిపించనున్న సినిమా కూడా ఇదే కావడంతో ఈ సినిమాపై ఈ స్థాయి క్రేజ్‌కు ఓ కారణంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే పోస్టర్స్, ట్రైలర్స్, ప్రమోషన్స్‌తో ఈ సినిమా ప్రేక్షకులకు చేరిపోయింది. ఈ నేపథ్యంలో సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఓవర్సీస్‌లోనూ ఈ సినిమా భారీ రిలీజ్‌ను ప్లాన్ చేయడంతో బ్రూస్ లీ ఓపెనింగ్ వీకెండ్ రికార్డులు సృష్టించే అవకాశం కనిపిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు