“కేజీయఫ్ 2” తెలుగు రైట్స్ భారీ ధరకు.?

Published on Feb 23, 2021 11:00 am IST

కన్నడ రాకింగ్ స్టార్ యాష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ పవర్ ఫుల్ విలన్ గా ఇలా అదిరిపోయే క్యాస్టింగ్ తో సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిచిన చిత్రం “కేజీయఫ్ చాప్టర్ 2”. ఇండియన్ వైడ్ భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం ఎంత వసూళ్లను రాబడుతుందా అని అంతా ఇప్పటి నుంచే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి అందుకు తగ్గట్టుగానే అన్ని భాషల్లోనూ ఈ చిత్రం భారీ స్థాయి బిజినెస్ లెక్కలనే నమోదు చేస్తుంది అని వింటూనే ఉన్నాము.

అయితే మన తెలుగు థియేట్రికల్ హక్కుల విషయానికి వస్తే మాత్రం ఆసక్తికర టాకే బయటకొచ్చింది. తెలుగులో ఈ చిత్రం హక్కులను ఇక్కడి టాప్ నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు కొనుగోలు చేసినట్టుగా కన్నడ సినీ వర్గాలు చెబుతున్నాయి. అంతే కాకుండా 65 కోట్ల భారీ ధరను దిల్ రాజు వెచ్చించినట్టుగా వారు చెబుతున్నారు. మరి ఇందులో ఎంతవరకూ నిజముందో కానీ రెండు సినీ వర్గాల్లో కూడా ఈ ఫిగర్ వైరల్ అవుతుంది. ఇక ఈ మాస్ మసాలా బొమ్మ ప్రపంచ వ్యాప్తంగా జూలై 16న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :