ఎన్టీఆర్, నెల్సన్ ప్రాజెక్ట్ పై సాలిడ్ క్లారిటీ!

ఎన్టీఆర్, నెల్సన్ ప్రాజెక్ట్ పై సాలిడ్ క్లారిటీ!

Published on Jul 5, 2026 9:00 PM IST

ప్రస్తుతం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా సెన్సేషనల్ లైనప్ ని సిద్ధం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో భారీ చిత్రం డ్రాగన్ చేస్తుండగా ఈ చిత్రం తర్వాత గాడ్ ఆఫ్ వార్ అనే బిగ్ బడ్జెట్ సినిమా చేస్తున్నారు. ఇలా ఊహించని ప్రాజెక్ట్ లతో తారక్ సిద్ధం అవుతుండగా తన లైనప్ లో ఆ మధ్య వచ్చిన క్రేజీ రూమర్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ కోసం కూడా ఒకటి.

అయితే ఈ మాసివ్ కాంబినేషన్ పై సాలిడ్ క్లారిటీ ఇప్పుడు వచ్చేసింది. నిర్మాత నాగవంశీ లేటెస్ట్ కామెంట్స్ వైరల్ గా మారాయి. తమ కాంబినేషన్ లో సినిమా ఉందని కన్ఫర్మ్ చేశారు. ప్రస్తుతానికి నెల్సన్ కి ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చామని అది కూడా ఎన్టీఆర్ తో ప్రాజెక్ట్ కోసమే అని కన్ఫర్మ్ చేశారు. కానీ కొంత సమయం పడుతుంది అని తెలిపారు. దీనితో నెల్సన్ తో కాంబినేషన్ కోసం చూస్తున్న ఫ్యాన్స్ కి క్రేజీ అప్డేట్ ని చెప్పొచ్చు.

తాజా వార్తలు