ఈ ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘మ్యాడ్ స్క్వేర్’

ఈ ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘మ్యాడ్ స్క్వేర్’

Published on Apr 25, 2025 8:06 AM IST

లేటెస్ట్ గా మన టాలీవుడ్ అందించిన సాలిడ్ హిట్ చిత్రాల్లో యంగ్ హీరోస్ నార్నే నితిన్, సంగీత్ శోభన్ అలాగే రామ్ నితిన్ ల కలయికలో దర్శకుడు కళ్యాణ్ శంకర్ తెరకెక్కించిన సాలిడ్ హిట్ చిత్రం “మ్యాడ్ స్క్వేర్” కూడా ఒకటి. యువతను మరోసారి ఎంతగానో అలరించిన ఈ చిత్రం భారీ వసూళ్లు కూడా అందుకుంది. ఇక ఈ సినిమా థియేటర్లు రన్ తర్వాత ఇపుడు ఫైనల్ గా ఓటీటీలో రిలీజ్ కి వచ్చేసింది.

ఈ సినిమా ఓటీటీ హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మరి అందులో నేటి నుంచి ఈ సినిమా పాన్ ఇండియా భాషల్లో ఎంటర్టైన్ చేసేందుకు వచ్చేసింది. మరి ఈ చిత్రాన్ని చూడాలి అనుకునేవారు ఇపుడు నెట్ ఫ్లిక్స్ లో ట్రై చేయవచ్చు. ఇక ఈ సినిమాకి సితార ఎంటర్టైన్మెంట్స్ అలాగే ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహించారు.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు