“ఆదిపురుష్” ఫస్ట్ లుక్ పై పెరుగుతున్న భారీ హైప్.!

“ఆదిపురుష్” ఫస్ట్ లుక్ పై పెరుగుతున్న భారీ హైప్.!

Published on Sep 27, 2022 7:01 AM IST

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ చిత్రాల్లో ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి సిద్ధంగా ఉన్న భారీ చిత్రం “ఆదిపురుష్” కోసం అందరికీ తెలిసిందే. బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన ఈ భారీ ప్రాజెక్ట్ రామాయణం ఆధారంగా తెరకెక్కింది. ఇక ఈ అవైటెడ్ సినిమా నుంచి అభిమానులు పాన్ ఇండియా ఆడియన్స్ కూడా చాలా ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్ కోసం ఎదురు చూస్తున్నారు.

మరి దీనితో పాటుగా ఫస్ట్ టీజర్ కూడా వచ్చే అవకాశం ఉందని గట్టి టాక్ ఇప్పుడు స్టార్ట్ కాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ అయితే ఈ అక్టోబర్ 2కి ఆల్ మోస్ట్ ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తుంది. దాన్ని రివీల్ చేస్తూ వీడియో కూడా ఉండొచ్చని అంటున్నారు. మొత్తానికి అయితే ఆదిపురుష్ ఫస్ట్ లుక్ విషయంలో అయితే ఇప్పుడు భారీ హైప్ తో మంచి హంగామా నడుస్తుంది. ఇది కానీ ఏమాత్రం అంచనాలకు తగ్గట్టు ఉన్నా కూడా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ నంబర్స్ చూడొచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు