“వకీల్ సాబ్”కు కూడా గట్టి ప్లానింగ్స్ ఉన్నాయట!

Published on Oct 21, 2020 7:01 am IST

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం “వకీల్ సాబ్”. బాలీవుడ్ హిట్ చిత్రం పింక్ కు రీమేక్ గా ఈ చిత్రాన్ని దర్శకుడు శ్రీరామ్ వేణు తెరకెక్కిస్తున్నారు. లాక్ డౌన్ వల్ల నిలిచిపోయిన ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది కానీ ఇప్పుడు దాదాపు షూట్ పూర్తి చేసుకొనే అంతిమ దశలో ఉంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఇంకా రావాల్సిన బడా అప్డేట్లు చాలానే ఉన్నాయి.

వాటిలో అతి కీలకమైనది ఈ చిత్రం తాలూకా టీజర్. దీని కోసమే పవన్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ టీజర్ కు సంబంధించి లేటెస్ట్ టాక్ ఒకటి వినిపిస్తుంది. మేకర్స్ వకీల్ సాబ్ టీజర్ ను గట్టిగానే ప్లాన్ చేస్తున్నారట. సినిమాలోని కీలక షాట్స్ తో కట్ చేస్తున్నారట.

అలాగే దీనికి థమన్ కూడా అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తున్నాడని కూడా తెలుస్తుంది. కానీ టీజర్ ను మాత్రం ఎప్పుడు విడుదల చేస్తున్నారన్నది ఇంకా తెలియరాలేదు. చాలా కాలం తర్వాత పవన్ నుంచి వస్తున్న టీజర్ కావడంతో ఈ పవన్ ఫ్యాన్స్ ఇప్పటి నుంచే భారీ రికార్డులు సెట్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ టీజర్ ఎప్పుడు వస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :

More