ఓవర్సీస్ లో “పొన్నియిన్ సెల్వన్” కి సాలిడ్ రెస్పాన్స్.!

Published on Oct 2, 2022 9:00 am IST

చియాన్ విక్రమ్ హీరోగా కార్తీ, జయం రవి అలాగే త్రిష మరియు ఐశ్వర్య రాయ్ లాంటి స్టార్స్ ఎందరో సమాహారంలో తెరకెక్కించిన లేటెస్ట్ భారీ చిత్రం “పొన్నియిన్ సెల్వన్ 1”. లెజెండరీ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ మంచి అంచనాలు నడుమ రిలీజ్ కాగా దీనికి అయితే మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ నమోదు అయ్యాయి. అయితే అనుకున్నట్టు గానే ఈ చిత్రానికి ఓవర్సీస్ లో మంచి వసూళ్లు నమోదు అవుతున్నట్టు తమిళ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఈ చిత్రానికి రెండు రోజుల్లోనే ప్రీమియర్స్ తో కలిపి యూఎస్ లో 3 మిలియన్ డాలర్ వసూళ్లు వచ్చాయట. ఇది మాత్రం ఈ ఏడాది తమిళ్ సినిమాల్లో భారీ రెస్పాన్స్ అని చెప్పాలి. దీని బట్టి అయితే తమిళ్ వెర్షన్ లో ఈ చిత్రం మంచి వసూళ్లే అందుకునేలా ఉందని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించగా లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :