గట్టి రెస్పాన్స్ నే తెచ్చుకున్న “వకీల్ సాబ్” టీజర్..!

Published on Jan 15, 2021 7:03 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “వకీల్ సాబ్”. పవన్ కెరీర్ లో ఏ సినిమా టీజర్ కోసం కూడా అతని అభిమానులు ఇంతలా ఎదురు చూసి ఉండరు. ఈ సాలిడ్ కం బ్యాక్ కు గాను అంతే స్థాయి రెస్పాన్స్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. మరి అందుకు తగ్గట్టుగానే ఈ టీజర్ కు మొదటి నిమిషం నుంచి పోటాపోటీ రికార్డులు అందిస్తూనే వచ్చారు.

మరి అలా కేవలం 12 గంటల్లోనే 6.2 మిలియన్ వ్యూస్ మరియు 6 లక్షల77 వేల లైక్స్ తో సాలిడ్ అండ్ ఫాస్టెస్ట్ రికార్డులు అందించారు. మరి 24 గంటల్లో అయినా 1 మిలియన్ మార్క్ ను రీచ్ అయ్యి మొట్టమొదటి ఫాస్టెస్ట్ 1 మిలియన్ లైక్డ్ టీజర్ గా నిలుపుతారో లేదో చూడాలి.మరి ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా నివేతా థామస్, అంజలీలు కీలక పాత్రల్లో నటించారు. అలాగే థమన్ సంగీతం అందించగా దిల్ రాజు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :