షారుఖ్, అట్లీ బిగ్ ప్రాజెక్ట్ పై మరో సాలిడ్ అప్డేట్.!

Published on Sep 3, 2021 9:25 pm IST

కోలీవుడ్ స్టార్ యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు అట్లీ బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తో ఓ భారీ ప్రాజెక్ట్ ని ప్లాన్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. మల్టీ లాంగువల్ గా భారీ పాన్ ఇండియన్ సినిమాగా దీనిని తెరకెక్కించనున్నారు. అయితే గత కొంత కాలం నుంచి ఈ ప్రాజెక్ట్ పలు ఆసక్తికర అంశాలే వినిపిస్తుండగా ఇప్పుడు మరో సాలిడ్ బజ్ దీనిపై వినిపిస్తుంది.

ఈ చిత్రానికి గాను అట్లీ హిట్ చిత్రాల సినిమాటోగ్రాఫర్ జి కే విష్ణు లాక్ అయ్యినట్టు తెలుస్తుంది. “మెర్సల్” మరియు “బిగిల్” రీసెంట్ గా మాస్ మహారాజ్ తో “క్రాక్” సినిమాకి వర్క్ చేసిన తన వర్క్ కి పెద్ద అప్లాజ్ నే దక్కింది. మరి ఇప్పుడు ఈ సినిమాతో తన కెరీర్ లో మరో బెంచ్ మార్క్ సెట్ చేసినట్టే అని చెప్పాలి. దీనితో మూవీ లవర్స్ ఈ సినిమా అవుట్ పుట్ పై మరిన్ని అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ ఏడాది చివరలో ఈ చిత్రం పట్టాలెక్కనున్నట్టుగా టాక్.

సంబంధిత సమాచారం :