మెగా ఫీస్ట్ కి అదిరే అప్డేట్స్ ఉన్నాయట.!

Published on Aug 11, 2021 7:04 am IST


లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివతో “ఆచార్య” అనే భారీ బడ్జెట్ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రంలో మెగాస్టార్ తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు. అయితే ఇక ఇదే ఆగష్టు నెలలో మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే కూడా ఉండగా దానికి మెగా ఫ్యాన్స్ భారీ ప్లానింగ్ లే ఆల్రెడీ స్టార్ట్ చేసారు.

అయితే ఈ ఈ బర్త్ డే కి మెగాస్టార్ సినిమాల నుంచి అదిరే అప్డేట్స్ రానున్నట్టుగా మెగా వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఆచార్య నుంచి మంచి అప్డేట్స్ రానున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో కాజల్ మరియు పూజా హెగ్డేలు హీరోయిన్స్ గా నటిస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. అలాగే మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :