ఈ ఏడాదిలో టాలీవుడ్ నుంచి వచ్చిన సెన్సేషనల్ హిట్ చిత్రం “హను మాన్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రంలో యంగ్ హీరో తేజ సజ్జ (Teja Sajja) హీరోగా నటించగా టాలెంటెడ్ నటుడు గెటప్ శ్రీను కూడా ముఖ్య పాత్రలో కనిపించాడు. మరి డిఫరెంట్ గెటప్స్ మ్యానరిజంలతో అలరించే గెటప్ శ్రీను హీరోగా చేసిన లేటెస్ట్ చిత్రమే “రాజు యాదవ్”.
దర్శకుడు కృష్ణమాచారి తెరకెక్కించిన ఈ చిత్రం రీసెంట్ గా ట్రైలర్ తో ఆకట్టుకుంది. అయితే హీరోగా ఇది గెటప్ శ్రీనుకి మొదటి సినిమా కావడం విశేషం. మరి ఈ చిత్రాన్ని మేకర్స్ ఈ మే 17కి లాక్ చేసిన సంగతి తెలిసిందే. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ లాంటి హీరో సినిమా “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”, స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటించిన చిత్రం “సత్యభామ” లాంటి సినిమాలు కూడా ఉన్నప్పటికీ రాజు యాదవ్ ని లాక్ చేశారు.
అయితే ఇప్పటికీ అదే డేట్ లో రాజు యాదవ్ లాక్ అయ్యే ఉంది కానీ ఆ రెండు సినిమాలు పోస్ట్ పోన్ అయ్యాయి. మరి ఇది గెటప్ శ్రీను సినిమాకి మంచి ప్లస్ అని చెప్పవచ్చు. మరి ఈ ప్రైమ్ టైం లో సోలోగా రిలీజ్ కి వస్తున్నా ఈ చిత్రం ఎలాంటి స్పందనను అందుకుంటుందో చూడాలి.