సూపర్ స్టార్ రజనీకాంత్ – యాక్షన్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో చేస్తున్న రజిని 168వ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా అని అభిమానులు ఆశగా ఎదురుచూశారు. మొత్తానికి రజిని ఈ సినిమా షూట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. కాగా రేపు రామోజీ ఫిల్మ్ సిటీలో జరగబోయే షూట్ లో రజిని పై కొన్ని సోలో షాట్స్ తీయబోతునట్లు తెలుస్తోంది. ఈ షాట్స్ ఇంటర్వెల్ సీక్వెన్స్ లో వస్తాయట. ఇక ఈ ఇంటర్వెల్ సీన్స్ వెరీ ఇంట్రస్టింగ్ గా ఉంటాయట. ఆ తరువాత రజిని – ఖుష్బూ కలయికలో వచ్చే ఫ్యామిలీ సీన్స్ తీస్తారని తెలుస్తోంది.
కాగా ఖుష్బూ ఈ సినిమా కోసం బరువు తగ్గి సరికొత్తగా రెడీ అయింది. రజిని సర్ కాబట్టే.. ఈ సినిమా చేస్తున్నాను. అలాగే నా పాత్ర కూడా నాకు కొత్తగా అనిపించింది. ఇక రజిని సర్ నాకు మధ్య కాంబినేషన్ సీన్స్ చాలా బాగుంటాయి. కచ్చితంగా మిమ్మల్ని అలరిస్తాయి’ అని ఖుష్బూ లేటెస్ట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
రజనీ – ఖుష్బూలది హిట్ కాంబినేషన్. గతంలో రజనీ, ఖుష్బూలు కలిసి ‘అన్నామలై, మన్నన్, పాండియన్, నట్టుక్కు ఓరు నల్లవన్’ వంటి సినిమాల్లో కలిసి చేశారు. మళ్లీ చాలా సంవత్సరాలు తరువాత ఇప్పుడు కలిసి నటిస్తున్నారు.


