ఈరోజు మళ్లీ ఇండియన్ స్మాల్ స్క్రీన్ హిస్టరీ లో ఒక బిగ్ డే. గత ఏడాది బిగ్గెస్ట్ రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ తెలుగు 3 సీసన్ భారీ టీఆర్పి రికార్డు సెట్ చేసింది. మరి ఈరోజు సీసన్ 4 ఫైనల్స్ ఎంత నెలకొల్పుతుందో చూడాల్సి ఉంది. అయితే ఇప్పుడు విన్నర్ ఎవరా అన్న టాక్ రసవత్తరంగా మారింది.
దీనితో ఇప్పటికే పలువురు కంటెస్టెంట్స్ అభిమానులు తమ అభిమాన వ్యక్తే విన్నర్ అని ఫిక్స్ అయ్యిపోయారు. అయితే మరికొంత మంది మాత్రం తమ కంటెస్టెంట్ కు చివరి రెండు వారాల్లో పెరిగిన గ్రాఫ్ చూసి వాళ్లే విన్నర్ అనుకుంటే పొరపాటే అని చెప్పాలి. ఎందుకంటే వారి కన్నా ముందే మరికొందరు చాలా స్ట్రాంగ్ ఓటింగ్ తో ఇప్పటి వరకు నిలుస్తూ వచ్చారు.
మరి వారిని కూడా ఈ చివరి నిమిషంలో గ్రాఫ్ పెంచుకున్న వారు దాటేశారు అని ఊహించేసుకోవడం గాల్లో లెక్కలు వేసుకోడం వంటిదే అని చెప్పాలి. మరి ఈ మధ్య కాలంలో ఎవరెవరికి గ్రాఫ్ పెరిగిందో తెలిసిందే. బహుశా వారు టాప్ 3 స్థానాల్లో ఉండొచ్చు ఏమో కాని టైటిల్ విన్నింగ్ వరకు అయితే కష్టమే అని చెప్పాలి.


