చరణ్, శంకర్ భారీ ప్రాజెక్ట్ పై క్లియర్ అవుతున్న అంశాలు.!

Published on Apr 29, 2021 8:00 am IST

ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర రాబోతున్న పలు భారీ చిత్రాల్లో జస్ట్ అనౌన్సమెంట్ తోనే సెన్సేషన్ ను నమోదు చేసింది మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు విజనరీ దర్శకుడు శంకర్ ల కాంబో. అక్కడ నుంచి ఎనలేని అంచనాలు సెట్ చేసుకొని మోస్ట్ ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్ గా నిలిచిన ఈ చిత్రంపై రూమర్స్ కూడా అలానే చాలా మొదలయ్యాయి. మరి అలా వాటిలో కొన్నింటిపై క్లారిటీ ఇప్పుడు వచ్చినట్టు తెలుస్తుంది.

ఈ చిత్రంలో చరణ్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ కనిపిస్తాడని అంతే కాకుండా ఓ పొలిటికల్ డ్రామాలా శంకర్ మార్క్ లో ఉంటుందని టాక్ వచ్చింది. మరి ఇప్పుడు ఇదే నిజం అన్నట్టు తెలుస్తుంది. అంతే కాకుండా హీరోయిన్స్ రేస్ లో కియారా అద్వానీ పేరు కూడా వచ్చినట్టు తెలిసింది. మరి ఇప్పుడు ఆమెనే ఏఈ సినిమాలో ఫైనల్ అయ్యినట్టు టాక్. మరి మొత్తానికి వీటిపై అయితే ఆల్మోస్ట్ క్లారిటీ వచ్చేసినట్టే అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :