మెగాస్టార్ నెక్స్ట్ స్టెప్ పై క్లారిటీ.!

Published on Sep 23, 2020 11:03 am IST

ప్రస్తుతం టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి మన టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో “ఆచార్య” అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొంత మేర షూటింగ్ పూర్తి కాబడిన ఈ చిత్రం భారీ అంచనాలను నెలకొల్పుకుంది. అయితే ఈ చిత్రం తర్వాత చిరు మరో రెండు ప్రాజెక్టులను ఒకే చేసారు. పైగా ఆ రెండు కూడా రీమేక్ చిత్రాలే కావడం గమనార్హం.

మరి ఆచార్య తర్వాత చిరు ఓటు వినాయక్ కు వేస్తారా లేక మెహర్ కు వేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇద్దరు దర్శకులు కూడా తమకిచ్చిన రెండు చిత్రాల స్క్రిప్ట్ వర్క్ ను పూర్తి చేసేసారు. కానీ చిరు మాత్రం ముందు మెహర్ తోనే వేదాళం రీమేక్ కు మొగ్గు చూపుతున్నట్టు వినికిడి. ఆచార్య పూర్తయ్యాక చిరు మొదట ఈ ప్రాజెక్ట్ నే టేకప్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. ఇప్పటికే గుండు లుక్ తో కనిపించి బాస్ ఆకట్టుకున్నారు. మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలు కానుందో చూడాలి.

సంబంధిత సమాచారం :

More