పవన్ క్రేజీ ప్రాజెక్ట్ పై మరింత క్లారిటీ.!

Published on Sep 29, 2020 8:05 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి ఇపుడు వరుసపెట్టి వరుస ప్రకటనలతో అతని అభిమానుల్లో నూతన ఉత్తేజాన్ని నెలకొల్పుతున్నారు. ఇప్పటికే ప్రాజెక్టులను లైన్ లో ఉంచగా వాటితో పాటుగా పవన్ వీరాభిమాని మరియు టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ తో ఓ ప్రాజెక్ట్ ను ఓకె చేసేసారు.

అయితే ఇన్ని ప్రాజెక్టులలో కూడా పవన్ అభిమానులు అమితంగా ఎదురు చూస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ మాత్రం ఒకటి ఉంది. అదే మన టాలీవుడ్ విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడితో ప్లాన్ చేసిన పీరియాడిక్ డ్రామా. అయితే ఈ చిత్రం విషయంలో ఒక అంశానికి సంబంధించి ఎప్పటి నుంచో సరైన క్లారిటీ లేదు.

అదే ఇంతకీ ఈ చిత్రాన్ని పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా ప్లాన్ చేస్తున్నారా లేదా అని. కానీ లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ చిత్రాన్ని పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గానే ప్లాన్ చేస్తున్నారట. మేకర్స్ ఈ చిత్రాన్ని కేవలం మన దగ్గర మాత్రమే కాకుండా పాన్ ఇండియన్ రిలీజ్ గానే ప్లాన్ చేయడానికి డిసైడ్ అయ్యారట. మొత్తానికి ఈ పవన్ నుంచి “సర్దార్ గబ్బర్ సింగ్” తర్వాత మళ్ళీ హిందీలోకి ఈ చిత్రం వెళ్లనుంది.

సంబంధిత సమాచారం :

More