చిరు కోసం కాజల్ అప్పుడే వచ్చేస్తుందా..నిజమెంత?

Published on Oct 31, 2020 9:00 am IST

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ తో తీస్తున్న భారీ చిత్రం “ఆచార్య”. సైరా లాంటి పీరియాడిక్ సినిమా అంతరం ఒక కొత్త కథతో అందులోనూ కొరటాలతో అనౌన్స్ చెయ్యడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ ఏడాది వచ్చిన లాక్ డౌన్ మూలాన పరిస్థితులు అన్నీ తయారు మారు కావడంతో షూట్ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తుంది.

ఇదిలా ఉండగా ఇప్పుడు ఆచార్య షూట్ కు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా ఈ షూట్ లో పాల్గొననుంది టాక్ వినిపిస్తుంది. వచ్చే నవంబర్ రెండవ వారం నుంచే కాజల్ రానుంది అని బజ్ సంతరించుకుంది. అయితే అందుకు అవకాశం ఉందా అన్న అనుమానాలు కూడా ఇప్పుడు కలుగుతున్నాయి. ఎందుకంటే కొన్ని గంటల కితమే కాజల్ పెళ్లి అయ్యింది.

మరి కనీసం రెండు వారాల విరామం లోనే మళ్ళీ తన వృత్తిలోకి వచ్చేస్తుందా అన్నది అనుమానమే మరి. మొత్తానికి మాత్రం ఏదన్నా అధికారిక సమాచారం వచ్చేంత వరకు మాత్రం ఏది డిసైడ్ చెయ్యడానికి లేదు. కాజల్ ఇది వరకే చిరుతో “ఖైదీ నెం 150″తో అలరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కాంబోకు మణిశర్మ సంగీతం అందిస్తుండగా మ్యాట్నీ ఎంటెర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More