టాలీవుడ్ : వారి దోపిడీపై నిర్మాతల నిరసన..!

టాలీవుడ్ : వారి దోపిడీపై నిర్మాతల నిరసన..!

Published on Dec 18, 2022 4:00 PM IST

టాలీవుడ్ సినిమా ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర ఎలాంటి స్థాయిలో ఉందో అందరికీ తెలిసిందే. అలాగే ప్రపంచ వ్యాప్తంగా కూడా టాలీవుడ్ కి ఎంతో గుర్తింపు ఇప్పుడు వస్తుంది. మరి ఎంత పెద్ద పరిశ్రమ అయినప్పటికీ అందులో ఉంది ఆ సినిమానే నమ్ముకున్న అందరికీ అనుకూలంగానే కొన్ని పరిస్థితులు ఉంటాయని చెప్పలేము. సినిమాపై ఉన్న మక్కువతో కొందరు నిర్మాతలు తమ పరిధిలో సినిమాలు చేస్తూ ఉంటారు.

మరి అనేక వర్గాలకి సంబంధించి టాలీవుడ్ లో పలు శాఖలు ఉండగా వాటిలో ప్రొడ్యూసర్స్ నుంచి కూడా ఓ కౌన్సిల్ ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న డిజిటల్ యుగంలో రీల్స్ తో సినిమా ప్రదర్శితం చేయడం నుంచి నేరుగా డిజిటల్ ప్రింట్స్ తో సినిమాలు వస్తున్నాయి అయితే ఇది ముందు కన్నా సులువైన పనిగా మారగా ఖర్చు కూడా ఎక్కువే అవుతుంది.

అయితే దీనిపైనే సెప్టెంబర్ 6వ తేదీ జరిగిన ప్రొడ్యూసర్ కౌన్సిల్ జనరల్ బాడీ మీటింగ్ లో 15 రోజులలో ఎలక్షన్స్ పెట్టాలని నిర్ణయం తీసుకోగా దీనిని అపహాస్యం చేస్తూ, మొండిగా వ్యవహరిస్తున్న కౌన్సిల్ వ్యవహార శైలిని వ్యతిరేకిస్తూ, నిర్మాతల పాలిట శాపంగా మారి దోపిడీకి గురిచేస్తున్న డిజిటల్ ప్రొవైడర్స్ (Qube, UFO, Scrabble) ధరలను తగ్గించాలనే నినాదంతో రేపు ఉదయం 10.00 గంటలకు ఛాంబర్ అవరణములో రిలే నిరాహారదీక్షలు చేపట్టాలని కొందరు నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. మరి దీనితో ఈ సమస్యకి ఎప్పుడు ఎలాంటి పరిష్కారం దొరుకుంతుందో అనేది చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు