గెట్ రెడీ..”సీటీమార్” నుంచి ఏదో ఎగ్జైటింగ్ అప్డేట్ అట!

Published on Sep 2, 2021 2:30 pm IST

మన టాలీవుడ్ మ్యాచో మ్యాన్ గోపీచంద్ హీరోగా మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ మాస్ అండ్ స్పోర్ట్స్ ఎంటర్టైనర్ చిత్రం “సీటీమార్”. దర్శకుడు సంపత్ నంది తెరకెక్కించిన ఈ చిత్రం ఇపుడు రిలీజ్ కి రెడీగా ఉండగా మొన్ననే వచ్చిన ట్రైలర్ కి భారీ స్థాయి రెస్పాన్స్ కూడా వచ్చింది.

మరి అది అంచనాలకు మించే ఉండడంతో ఆడియెన్స్ కూడా ఈ సినిమా రాక కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్ర మేకర్స్ ఇప్పుడు ఒక ఎగ్జైటింగ్ అప్డేట్ కోసం చెబుతున్నారు. ప్రస్తుతం ప్రమోషన్స్ లో ఉన్న చిత్ర యూనిట్ ఏదో సంథింగ్ స్పెషల్ అప్డేట్ ని ఇవ్వనున్నట్టుగా తెలుపుతున్నారు.

మరి బహుశా అది ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసమే పైగా దానికి డార్లింగ్ హీరో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ వస్తున్నాడేమో అన్నది కావచ్చు కాబోలు.. మరి వారు ఇస్తామంటున్న ఈ స్పెషల్ అప్డేట్ ఏమిటి అన్నది తెలియాలి అంటే వేచి చూడాల్సిందే. ఇక ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందివ్వగా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ వారు నిర్మాణం అందించారు.

సంబంధిత సమాచారం :