బాలయ్య సినిమా పై సోనాక్షి సిన్హా స్పందన !

Published on Dec 16, 2019 3:57 pm IST

నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోతున్న సినిమా గురించి ఇప్పటికే అనేక రూమర్స్ వస్తున్నాయి. అందులో ప్రధానంగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ను మెయిన్ విలన్ గా, సోనాక్షి సిన్హాని హీరోయిన్ గా తీసుకున్నారనే వార్త. అయితే తాజాగా సోనాక్షి సిన్హా ఈ వార్త స్పందిస్తూ ట్వీట్ చేసింది. బాలకృష్ణ – బోయపాటి సినిమాలో తానూ యాక్ట్ చేయట్లేదని.. అతి త్వరలోనే తన తరువాత సినిమా గురించి అప్ డేట్ ఇస్తానని చెప్పుకొచ్చింది.

అన్నట్లు బాలయ్య సినిమాలో సీనియర్ హీరో శ్రీకాంత్ మరో నెగటివ్ రోల్ లో కనిపించబోతున్నాడు. శ్రీకాంత్ ఇంతకు ముందు నాగచైతన్య ‘యుద్ధం శరణం’లో విలన్ గా నటించాడు. కాగా ఈ సినిమా ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ లో సాగే పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్. ఇప్పటికే బోయపాటి బాలయ్య కలయికలో వచ్చిన ‘సింహ, లెజెండ్’ చిత్రాలు భారీ విజయాలు సాధించాయి. అలాగే ఈ సినిమా కూడా హిట్ అయితే, వీళ్ళు హ్యాట్రిక్ హిట్ కొట్టినట్లే.

సంబంధిత సమాచారం :

X
More