‘పండగ చేస్కో’ టీంతో జత కలసిన సోనాల్ చౌహాన్

‘పండగ చేస్కో’ టీంతో జత కలసిన సోనాల్ చౌహాన్

Published on Oct 29, 2014 7:22 PM IST

Sonal-Chauhan
తెలుగులో ‘లెజెండ్’ సినిమాతో భారి హిట్ కొట్టిన ముంబై ముద్దుగుమ్మ సోనాల్ చౌహాన్. ఆ సినిమా విజయం తర్వాత యంగ్ & ఎనర్జిటిక్ హీరో రామ్ సరసన ‘పండగ చేస్కో’లో నటించడానికి అంగీకరించింది. చాలా రోజుల క్రితమే ఈ సినిమాకు సైన్ చేసినప్పటికీ, షూటింగ్ లో పాల్గొనలేదు. తాజాగా అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతున్న షెడ్యూల్ లో ‘పండగ చేస్కో’ టీంతో జాయిన్ అయ్యింది. హీరో రామ్, సోనాల్, కమెడియన్స్ పాల్గొనగా కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాత మూవీ యూనిట్ ఫారిన్ కి షిఫ్ట్ అవుతుందని సమాచారం.

గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ మరొక హీరోయిన్ గా నటిస్తుంది. బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. యాక్షన్ & రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ ఎన్నారై యువకుడిగా నటిస్తున్నారు. ఈ సినిమాను యునైటెడ్ మూవీస్ పతాకంఫై పరుచూరి ప్రసాద్ సమర్పణలో పరుచూరి కిరీటి నిర్మిస్తున్నారు. తమన్ సంగీత దర్శకుడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు