బాలయ్యకు జోడీగా మళ్ళీ ఆమెనే తీసుకున్నారు

Published on Jul 24, 2019 11:04 pm IST

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలకృష్ణ రెండు భిన్నమైన పాత్రల్లో కనిపిస్తున్నారు. కనుక ఇద్దరు హీరోయిన్లు ఉండనున్నారు. ఈ హీరోయినాల్ కోసం చాలారోజులు వెతికిన దర్శక నిర్మాతలు చివరికి సోనాల్ చౌహాన్ అయితే ఒక పాత్రకు బాగుంటుందని ఆమెను తీసుకున్నారట.

ఈమె మధ్య వయస్సులో ఉండే బాలయ్య పాత్రకు జోడీగా కనిపించనుంది. గతంలో ఈమె బాలకృష్ణతో కలిసి ‘లెజెండ్, డిక్టేటర్’ సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. ‘డిక్టేటర్’ తర్వాత ఆమె చేస్తున్న తెలుగు చిత్రం కూడా ఇదే కావడం విశేషం. ఇకపోతే మరొక కథానాయికగా ఎవరిని తీసుకుంటారనేది ఇంకా తెలియాల్సి ఉంది. సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘రూలర్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

సంబంధిత సమాచారం :