రూ.11 రూపాయలే రెమ్యూనరేషన్‌గా తీసుకున్న హీరోయిన్..!

Published on Aug 10, 2021 2:30 am IST

హీరోలు ఒక్కటే రెమ్యునరేషన్ భారీగా తీసుకోవాలా? వాళ్లు తీసుకునేటప్పుడు హీరోయిన్‌లు తీసుకుంటే తప్పేముంది? అని ఈ మధ్య హీరోయిన్ల రెమ్యునరేషన్ పెంపుపై చర్చ బాగానే జరుగుతుంది. ఈ క్రమంలో హీరోయిన్ రెమ్యునరేషన్ విషయంలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకొచ్చింది. ఫర్హాన్ అఖ్తర్ లీడ్ రోల్‌లో రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా దర్శకత్వం చేసిన “భాగ్ మిల్కా భాగ్” చిత్రం కోసం బాలీవుడ్ బ్యూటీ సోనం కపూర్ కేవలం రూ.11 రూపాయలే రెమ్యునరేషన్‌గా తీసుకున్నారట.

ఈ సినిమాలో సోనమ్ ఓ గెస్ట్ రోల్‌లో నటించింది. అయితే సోనమ్ తీసుకున్న రెమ్యునరేషన్ అంశాన్ని రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా తన ఆత్మకథ అయిన “ది స్ట్రేంజర్ ఇన్ ది మిర్రర్” పుస్తకంలో రాశారాయన. అయితే దీనికి కారణం సోనమ్ కు ఓం ప్రకాష్ మెహ్రాతో ఉన్న అనుబంధమే కారణమని తెలుస్తుంది. ఇదిలా ఉంటే సోనమ్ ఇంతకుముందు ఢిల్లీ 6 సినిమా కోసం కలిసి పనిచేశారు.

సంబంధిత సమాచారం :