ఇండియాలో ‘స్పైడర్ మ్యాన్’ రూమర్స్ పై స్పందించిన నిర్మాణ సంస్థ.. అసలు ఏమైందంటే!

ఇండియాలో ‘స్పైడర్ మ్యాన్’ రూమర్స్ పై స్పందించిన నిర్మాణ సంస్థ.. అసలు ఏమైందంటే!

Published on Jun 18, 2026 9:02 PM IST

ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆడియెన్స్ మరీ ముఖ్యంగా ఇండియన్ సినిమా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అవైటెడ్ హాలీవుడ్ సినిమానే ‘స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే’. టామ్ హోలాండ్ హీరోగా నటించిన ఈ అవైటెడ్ సినిమా నుంచి లేటెస్ట్ గా వచ్చిన ట్రైలర్ కి సాలిడ్ రెస్పాన్స్ నమోదు అయ్యింది. అంతేకాకుండా ఇండియా బుకింగ్స్ కూడా నిన్ననే మొదలు కాగా దీనికీ క్రేజీ రెస్పాన్స్ వచ్చింది.

అయితే ఈ బుకింగ్స్ వచ్చిన తర్వాత సినిమాపై ఇండియన్ ఫ్యాన్స్ డిజప్పాయింట్మెంట్ వ్యక్తం చేశారు. దీనికి ఇప్పుడు నిర్మాణ సంస్థ సోనీ పిక్చర్స్ ఇండియా వారు క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఏమైంది అంటే ఇండియాలో ఓవర్సీస్ వెర్షన్ కి 5 నిమిషాల నిడివి కట్ చేసారని ఇండియన్ సెన్సార్ బోర్డ్ విషయంలో ఫ్యాన్స్ తమ డిజప్పాయింట్మెంట్ ని వ్యక్తం చేశారు.

దీనితో ఈ సెగ సోనీ వారి దగ్గరకి కూడ వెళ్లడంతో వారు దీనిపై స్పందించారు. ఆ రూమర్స్ లో నిజం లేదని ఇంకా సినిమా సెన్సార్ కి కూడా ఇండియాలో వెళ్లలేదని సో ఆ ప్రచారంలో నిజం లేదని ఏమన్నా ఉంటే తమ నుంచే అప్డేట్ వస్తుంది అని వారు కన్ఫర్మ్ చేసారు. సో ఫ్యాన్స్ ఈ విషయంలో కాస్త ఊపిరి తీసుకోవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు