చరణ్ ఇంస్టాగ్రామ్ లో ప్రత్యక్షం కానున్న స్పెషల్ వీడియో.

Published on Jul 17, 2019 12:04 am IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవలే తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ప్రారంభించారు. తనకు సంబంధించిన అప్డేట్స్ ఇకపై తన అభిమానులతో ఇంస్టాగ్రామ్ ద్వారా పంచుకుంటానని తెలియజేయడం జరిగింది. కాగా తన తండ్రి చిరంజీవి హీరోగా దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “సైరా” మూవీ మేకింగ్ వీడియో ని తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లోనే పోస్ట్ చేసి అభిమానులకు చేరేలా చేయాలని రామ్ చరణ్ భావిస్తున్నారట.

ఈ భారీ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ పై రామ్ చరణ్ స్వయంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రానికి భారీగా ప్రచారం కల్పించే పనిలో భాగంగా చరణ్ ఇలాంటి ప్రణాళికలు వేస్తున్నాడని సమాచారం. చిరంజీవి భార్య పాత్రలో నయనతార నటిస్తుండగా,అమితాబ్, తమన్నా,విజయ్ సేతుపతి,జగపతి బాబు,సుదీప్ వంటి వివిధ పరిశ్రమలకు చెందిన ప్రముఖ నటులు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 2విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం :

X
More