బిగ్ బాస్ 5: హోస్ట్ పై త్వరలో రానున్న క్లారిటీ!

Published on Jul 6, 2021 6:03 pm IST

బుల్లి తెర రియాలిటీ షో బిగ్ బాస్ 5 పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ షో ఈ ఏడాది ఆగస్ట్ చివరి వారం లో ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సారి ఈ షో లో పెద్ద పెద్ద సెలబ్రిటీ లు కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాలు బిగ్ బాస్ పై మరింత ఆసక్తి పెంచేలా చేస్తున్నాయి.

అయితే గతేడాది అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ ఏడాది కూడా నాగార్జున ను అనుకున్నప్పటికీ సినిమా షూటింగ్ కారణంగా రానా తో నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి.అయితే దీని పై ఇంకా గందరగోళ పరిస్థితి రావడం తో ఎవరు హోస్ట్ చేశారు అనే దాని పై స్టార్ మా త్వరలో అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. అయితే హోస్ట్ గా రానా వస్తారా లేక వేరే ఇంక ఎవరైనా అనేది తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :