మండాడి : రిలీజ్ డేట్ లాక్ చేసిన సుహాస్-సూరి పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామా.. ఎప్పుడంటే..?

మండాడి : రిలీజ్ డేట్ లాక్ చేసిన సుహాస్-సూరి పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామా.. ఎప్పుడంటే..?

Published on Jun 11, 2026 7:31 PM IST

తమిళ నటుడు సూరి, టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ సుహాస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సరికొత్త యాక్షన్ డ్రామా ‘మండాడి’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాతో సుహాస్ కోలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇస్తు్న్నాడు. ఇక ఈ సినిమా కథ సముద్రం చుట్టూ తిరుగుతుండటంతో ఈ మూవీ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. కాగా, ఈ సినిమా నుంచి మేకర్స్ తాజాగా ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు.

‘మండాడి’ చిత్ర రిలీజ్ డేట్‌ను మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. సెప్టెంబర్ 4, 2026న ఈ చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఈ సినిమాను తమిళ, తెలుగు, భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయనున్నారు. ‘సముద్రం నుండి పుట్టిన కథ.. ప్రపంచాన్ని జయించడానికి సిద్ధమైంది’ అంటూ ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు చిత్ర యూనిట్.

ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ సమర్పిస్తుండగా ఆర్.ఎస్.ఇన్ఫోటైన్‌మెంట్ పతాకంపై ఎల్రెడ్ కుమార్ నిర్మిస్తున్నారు. మదిమారన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో మహిమ నంబియార్, సీనియర్ నటుడు సత్యరాజ్, రవీంద్ర విజయ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు