“పుష్ప”రాజ్ కంట్రోల్ కి వచ్చేసిన ఆల్ టైం రికార్డ్.!

Published on Aug 14, 2021 12:00 pm IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “పుష్ప”. క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ భారీ పాన్ ఇండియన్ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా వాటిలో మొదటి పార్ట్ “పుష్ప ది రైజ్” నుంచి భారీ హైప్ తో మోస్ట్ అవైటెడ్ ఫస్ట్ సింగిల్ గా మొదటి లిరికల్ సాంగ్ ని లాంచ్ చేశారు. మరి దీనితో ఈ సాంగ్ రావడమే అన్ని భాషల్లో కూడా సాలిడ్ రెస్పాన్స్ తో అదరగొట్టింది.

అయితే తెలుగు వెర్షన్ కి మాత్రం అన్నిటికంటే అధిక రెస్పాన్స్ రావడంతో సౌత్ ఇండియన్ సినిమా దగ్గర ఆల్ టైం రికార్డు కొట్టడం ఖాయం అని అనుకోగా దానిని పుష్ప రాజ్ తన కంట్రోల్ లోకి తెచ్చేసుకున్నాడు. 24 గంటల్లో ఆల్ టైం రికార్డు రియల్ టైం వ్యూస్ 9.4 మిలియన్ వ్యూస్ మరియు 6 లక్షల 57 వేల ఆల్ టైం రికార్డ్స్ రెండిటిని సెట్ చేసి సెన్సేషన్ ని నమోదు చేసింది.

దీనితో ఫస్ట్ సింగిల్ నుంచే బన్నీ రికార్డ్స్ హంట్ మొదలయ్యింది అని చెప్పాలి. మరి ఈ అవుట్ స్టాండింగ్ ఆల్బమ్ ని రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సమకూర్చగా మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :