ఎస్పీ బాలు విషయంలో స్టార్ హీరోల మీద వస్తున్న విమర్శలకు చెక్ పెట్టిన చరణ్

ఎస్పీ బాలు విషయంలో స్టార్ హీరోల మీద వస్తున్న విమర్శలకు చెక్ పెట్టిన చరణ్

Published on Sep 29, 2020 1:08 AM IST


ప్రసిద్ద గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం అనారోగ్యంతో కన్నుమూయడంతో యావత్ దేశం శోక సంద్రంలో మునిగిపోయిన సంగతి తెలిసిందే. దేశ ప్రధాని మోదీ నుండి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, చిరు, రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, బాలయ్య నుండి అన్ని పరిశ్రమల నటీనటులు బాలు అస్తమయం పట్ల చాలా విచారించారు. ఈ నేపథ్యంలో ఎస్పీ బాలు అంత్యక్రియలకు కొందరు సినీ ప్రముఖులు మాత్రమే హాజరవడం చాలామంది బాలుకు తుది వీడ్కోలు పలకడానికి వెళ్ళకపోవడంతో వివాదాలు మొదలయ్యాయి.

ప్రధానంగా తమిళ హీరో అజిత్ బాలు అంతిమ సంస్కారాలకు వెళ్ళకపోవడంతో ఆయన మీద విమర్శలు రేగాయి. అజిత్ కు మద్దతుగా ఆయన అభిమానులు రంగంలోకి దిగడంతో వివాదం మరింత పెద్దదైంది. అలాగే తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు సైతం కరోనా కారణంగా హాజరుకాకపోవడంతో వారి మీద కూడ విమర్శలు మొదలయ్యాయి. బాలు చేత ఎన్నో హిట్ పాటలు పాడించుకుని స్టార్లగా ఎదిగిన హీరోలు కనీసం అంతిమసంస్కారాలకు వెళ్లరా అంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. తాజాగా అజిత్ వివాదం మీద స్పందించారు బాలు కుమారుడు ఎస్పీ చరణ్.

అజిత్ తమకు మంచి మిత్రుడన్న చరణ్ అంతిమసంస్కారాల్లో ఆయన ఉండి తీరాలన్న నిబంధన ఏం లేదు. ఆయన రాకపోవడం సమస్యేమీ కాదు. ఇంటి నుండే ఆయన సంతాపం తెలిపారు. ఆయన మా పట్ల సానుభూతి వ్యక్తం చేయలేదని అనడం భావ్యం కాదు. ఇలాంటి బాధాకర సమయంలో ఇలాంటి వివాదాలు మీద స్పందించడం నాకు ఇష్టం లేదు అంటూ అన్ని వివాదాలకు ఫులుస్టాప్ పెట్టారు. సో.. అజిత్ విషయంలో చరణ్ ఇచ్చిన క్లారిటీ తెలుగు పరిశ్రమకు కూడ వర్తిస్తుంది మరి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు