ఎస్పీ బాలు ఆఖరి భక్తి పాట – ఈ భాగ్య నగరిలో భద్రగిరి!

ఎస్పీ బాలు ఆఖరి భక్తి పాట – ఈ భాగ్య నగరిలో భద్రగిరి!

Published on Sep 29, 2020 10:46 PM IST


శ్రీ త్రిదండి చిన జియారుస్వామీ ఆశ్రమం పై దివంగత గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆఖరి భక్తి పాట ఈ భాగ్య నగరిలో భద్రగిరి. అయితే ఈ పాట కి తన గొంతు కలపడం అదృష్టం అంటూ స్వాతి రెడ్డి అన్నారు. ఎల్లిపోతావు రా మనిషి పాట తో ఈ గాయని ప్రాచుర్యం పొందినది. శ్రీ త్రిదండి చిన జియరు స్వామి వారి పై సింగర్ స్వాతి రెడ్డి ఒక వీడియో ఆల్బమ్ ను రూపొందించడం జరిగింది. అయితే ఈ ఆల్బమ్ కి కేదార్ నాథ్ సాహిత్యం ను సమకూర్చగా, పవన్ బాణీలు కట్టారు. అయితే ఈ భాగ్య నగరిలో భద్రగిరి ఆమె పాటను దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్వాతి రెడ్డి ఇద్దరు కలిసి ఆలపించారు.

అయితే ఈ వీడియో ఆల్బమ్ ను ఇటీవల శ్రీ త్రిదండి చిన జీయర్ స్వామి ఆవిష్కరించారు. అనంతరం సింగర్ స్వాతి రెడ్డ్యారియు నిర్మాత లను అభినందించడం జరిగింది. అయితే స్వాతి రెడ్డి మాట్లాడుతూ, ఓ రోజు విమానం లో ప్రయాణం చేస్తుండగా, శ్రీ త్రిదండి చిన జియరు స్వామి వారిని అనుకోకుండా కలుసుకొని వారి ఆశీస్సులు అందుకోవడం జరిగింది అని, అల వారు పాద స్పర్శ తో తనలో నూతనోత్సాహం, ఉత్తేజం మొదలైంది అని తెలిపారు. ఎస్పీ బాలు గారు సైతం తనను మెచ్చుకున్న విషయాన్ని తెలిపారు. అటువంటి గొప్ప గాయకులు మన మధ్య లేకపోవడం బాధాకరం అని, వారికి శ్రద్దాంజలి అంటూ తెలిపారు. అయితే మరొకసారి వారిని గుర్తుకు చేసుకుంటూ, స్వాతిరెడ్డి ఉక్ యూ ట్యూబ్ ఛానెల్ లో పాటను విడుదల చేసిన విషయాన్ని తెలిపారు. ఈ పాటకి మంచి స్పందన వస్తోంది అని, అంతా ప్రశంసిస్తున్నారు అని తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు