ఎస్.పి.బాలసుబ్రమణ్యం పాట.. ఆ పాటకు సూపర్ స్టార్ రజినీకాంత్ ఆట తోడైతే సినిమా బంపర్ హిట్ కొట్టేయడం గ్యారెంటీ. రజినీకాంత్ నటించినే అనేక బ్లాక్ బస్టర్ సినిమాలలో ఇంట్రడక్షన్ సాంగ్ పాడిన ఘనత బాలు సొంతం. తాజాగా కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో రజినీకాంత్ నటిస్తున్న ‘లింగా’ సినిమాలో కూడా ఎస్.పి.బాలు పాడారు.
ఈ మధ్య తమిళనాడులో నేను పబ్లిక్ ఫంక్షన్స్, ఇతర సభలకు హాజరయినప్పుడు రజిని అభిమానుల నుండి ఒకే ఒక్క ప్రశ్న ఎదురవుతుంది. ‘లింగా’ సినిమాలో మీరు పాట పాడుతున్నారా..? అని. అభిమానులు అంతా రజినికాంత్ ఇంట్రడక్షన్ సాంగ్ నేను పాడాలని కోరుకుంటున్నారు. ఎస్… నేను రెహమాన్ స్వరపరిచిన ఒక అద్బుతమైన కంపోజిషన్ లో నేను పాడడం జరిగింది. ఇటివలే రికార్డింగ్ పూర్తిచేశాం. వైరముత్తు లిరిక్స్ అందించారు. ప్రస్తుతానికి ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. కాని, ఒక్క మాట.. రజిని అభిమానులు ఈసారి నిరాశ చెందరు. అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఇటివలే క్లైమాక్స్ షూటింగ్ పూర్తిచేసిన ‘లింగా’ యూనిట్ త్వరలో సాంగ్స్ షూటింగ్ కోసం యూరోప్ వెళ్లనున్నారు. అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్లగా నటిస్తున్న ఈ సినిమాను రాక్ లైన్ వెంకటేష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.



